విదేశీ పెట్టుబడుల ఓనర్‌షిప్‌పై ఖతార్ ఇస్లామిక్ ఇన్స్యూరెన్స్ గ్రూప్ బోర్డ్ సూచనలు

- August 11, 2021 , by Maagulf
విదేశీ పెట్టుబడుల ఓనర్‌షిప్‌పై ఖతార్ ఇస్లామిక్ ఇన్స్యూరెన్స్ గ్రూప్ బోర్డ్ సూచనలు

దోహా: ఖతార్ ఇస్లామిక్ ఇన్స్యూరెన్స్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్,ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ సెక్షన్ నెంబర్ 6ని సవరించాలని ప్రతిపాదించడం జరిగింది.విదేశీ పెట్టుబడిదారులు, 100 శాతం ఓనర్‌షిప్ పొందేందుకు వీలుగా ఈ సవరణకు ప్రతిపాదించారు.గతంలో 49 శాతం మాత్రమే గ్రూప్ క్యాపిటల్‌కి ఈ అవకాశం వుండేది.కంపెనీ వెబ్‌సైట్ ద్వారా దీన్ని ప్రకటించారు. ఖతార్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సోషల్ మీడియా సైట్స్‌లో కూడా వుంచారు.సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్ అనుమతి దీనికి తప్పనిసరి అనీ, వాటి ఆమోదం తర్వాతే ఇది అమల్లోకి రావొచ్చని పేర్కొన్నారు.ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ అసెంబ్లీ మీటింగ్ దీనికి ఆమోదం పలకాల్సి వుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com