విశాఖ పోలీసుల కీలక నిర్ణయం
- August 11, 2021
విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కేసులు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి.ఏపీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి.ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పోలిస్తే, విశాఖలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.ముఖ్యంగా వీకెండ్స్‌లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన తరువాత విశాఖ బీచ్‌కు తాకిడి పెరిగింది.శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో బీచ్‌కు పర్యాటకులు తరలి వస్తున్నారు.ఒక్క విశాఖ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశాఖ బీచ్‌కు పర్యాటకులు తరలి వస్తుండటంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.వీకెండ్స్‌లో విశాఖ బీచ్‌లో సాయంత్రం 5 తరువాత ఎవరూ ఉండకూడదని, ఒకవేళ సాయంత్రం 5 తరువాత బీచ్‌లో ఎవరైనా కనిపిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.కరోనాను కంట్రోల్ చేయడానికి ఇదొక్కటే ప్రస్తుతానికి మార్గమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









