కోవిడ్ బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..!
- August 11, 2021
న్యూ ఢిల్లీ: కోవిడ్ బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రుణసదుపాయం కల్పిస్తోంది. చికిత్స కోసం అన్ని జాతీయ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు 5 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రకటించారు.ఇప్పటికే బ్యాంకులో దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి ఎలాంటి పూచీకత్తు లేకుండా చికిత్స కోసం రుణాలు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. కోవిడ్ రోగులకు సంబంధించి రాజ్యసభలో టీఆర్‌ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కొవిడ్ చికిత్స కోసం రూ.5 లక్షల మేరకు రుణం ఇవ్వాలని ఆయా బ్యాంకుల పాలకమండళ్లు ఒక విధానంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఏపీలో 2,791 మంది, తెలంగాణలో 3,389 మంది ఈ రుణాలు పొందినట్టు మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







