5 రోజుల్లో 242 మంది చిన్నారులకు కోవిడ్ పాజిటివ్
- August 11, 2021
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు చెబుతున్నారు.. పాజిటివ్‌గా తేలినవారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్లవారు 136 మంది ఉన్నారు.. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉండడం.. ఈసారి చిన్నారులపైనే అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో.. ఐదు రోజుల్లోనే పెద్ద సంఖ్యలో చిన్నారులు కోవిడ్ బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది.. దీంతో అప్రమత్తమైన అధికారులు చిన్నారులను ఇళ్లలోనే ఉంచాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







