ఆక్టోబర్ నుంచి డైరెక్ట్ క్లాసులు..విధివిధానాలు జారీ
- August 12, 2021
కువైట్: వచ్చే విద్యా సంవతసరం నుంచి డైరెక్ట్ క్లాసులు నిర్వహించాలని కువైట్ మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్ట్ క్లాసుల నిర్వహణపై విధివిధానాలను విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. ఆక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యర్ధులు క్లాసులకు ప్రత్యక్షంగా హజరు అవ్వాల్సి ఉంటుంది. అయితే..స్టూడెంట్స్ ను రెండు గ్రూపులుగా విభజించి..ఒక్కో గ్రూపుకు అల్టర్నేట్ డేస్ లో క్లాసులు నిర్వహిస్తారు. వ్యాక్సిన్ తీసుకోని ప్రతి విద్యార్ధికి, స్కూల్ స్టాఫ్ కు వారానికో సారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. పన్నెండేళ్లు..అంతుకుమించి వయసున్న విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రైమరీ స్కూల్ విద్యార్ధులకు ఉదయం 7.30కు స్కూల్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. ఇంటర్మీడియెట్ లెవల్ స్టూడెంట్స్ కి ఉదయం 7.30 గంటలకు స్కూల్ ప్రారంభమై మధ్యాహ్నాం 2.05 గంటలకు ముగుస్తుంది. ప్రాక్టికల్స్, టెక్నికల్ సబ్జెక్టులను తర్వాతి సెమిస్టర్ కు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!









