మావోయిస్ట్ కీలక నేతల అరెస్ట్..
- August 12, 2021
అమరావతి: మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.కూంబింగ్ జరుగుతోన్న కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు ఎదురుపడడం..కాల్పులు జరపడం..అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు మృతిచెందిన ఘటనలు ఎన్నో..చాలా సార్లు మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్న సందర్భాలున్నాయి.అయితే, తాజాగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు…అరెస్ట్ అయినవారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుండగా..మిగతావారు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.అదుపులోకి తీసుకున్న మావోయిస్టు కీలక నేతలను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక గత కొంత కాలంగా మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







