బహ్రెయిన్ లో 'బ్లడ్ డొనేషన్ డ్రైవ్'

- August 14, 2021 , by Maagulf
బహ్రెయిన్ లో  \'బ్లడ్ డొనేషన్ డ్రైవ్\'

మనామా: స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృత మహోత్సవ వేడుకలు ప్రపంచమంతటా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.మనామా లోని భారత అసోసియేషన్ 'సంస్కృతి' వారి ఆధ్వర్యంలో సాల్మనియా హాస్పిటల్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమం విజయవంతానికి సంస్కృతి అధ్యక్షులు ప్రవీణ్,జనరల్ సెక్రటరీ రితిన్ రాజ్ కమిటీ సభ్యులు ప్రేమసాగర్,వెంకటస్వామి కృషి చేశారు.తెలుగు రాష్ట్రాల నుంచి ప్రవాసీయులు విట్టల్,శ్రీనివాస్ గుప్తా,సంజీవ్ గంగాధర్,సుదర్శన్ వాలంటీర్లు గా పాల్గొన్నారు.ఇందులో భాగంగా కరోనా కష్ట కాలంలో తమవంతు బాధ్యత ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 135 మంది పాల్గొనడంతో సాల్మనియా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com