ప్రధాని మోడీ కీలక ప్రకటన
- August 14, 2021
న్యూ ఢిల్లీ: దేశ చరిత్రలో ఆగస్టు 14 వ తేదీని ఎప్పటికీ మర్చిపోలేరు.అఖండ భారతం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు.భారత్, పాక్ విడిపోయిన సమయంలో ప్రజలు పడిన బాధలను ఎన్నటికీ మర్చిపోలేమని, ప్రజల కష్టాలు,త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్ గా జరుపుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.ఇండియా పాక్ విభజన సమయంలో రెండు దేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు వారి ప్రాంతాలను నుంచి వేరు కావాల్సి వచ్చింది.ఆ సమయంలో ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగాయి.వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్‌గా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ







