జాతిపితకు కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పురస్కారం..!
- August 14, 2021
అమెరికా: మహాత్మా గాంధీని ప్రతిష్ఠాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పురస్కారంతో గౌరవించుకోవాలని అమెరికా ప్రతినిధులు తీర్మానించారు. న్యూయార్క్ప్రజాప్రతినిధి కరోలిన్ ఈ ప్రతిపాదనను సభ ముందు ఉంచగా సభ్యులు ఆమోదం తెలిపారు. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌ను అమెరికాలోనే అత్యున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తారు. నెల్సన్ మండేలా, ఆంగ్‌సాంగ్ సూకీ సహా పలువురికి ఈ మెడల్ అందించారు. అయితే, మరణానంతరం ఈ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ కానున్నారు.
మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం, ఆయన చూపిన అహింస మార్గాలు.. దేశానికి, ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు అమెరికా ప్రజాప్రతినిధులు. ఇతరులకు సేవ చేయడం కోసం సర్వస్వాన్ని ఇచ్చేయడం అనే దానికి గాంధీ ఓ ఉదాహరణ అని కొనియాడారు. ప్రపంచానికి శాంతి, అహింస మార్గాలు చూపి.. మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలని చట్టసభ్యురాలు కరోలిన్ కోరారు. దీంతో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌తో గాంధీని గౌరవించుకోవాలని ప్రతినిధుల సభ మరోసారి తీర్మానించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







