ఆఫ్ఘన్ మహిళలు, బాలికలపై దాడులు బాధాకరం: యుఎన్ చీఫ్
- August 14, 2021
జెనీవా: ఆఫ్ఘన్ మహిళల,బాలికలపై తాలిబన్‌లు విధిస్తున్న కఠిన ఆంక్షలు తనను కలవరపెడుతున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.వారి పై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు వెలువడిన నివేదికలు భయం కలిగించేవిధంగా ఉన్నాయని అన్నారు. తాలిబన్‌లు కాబూల్‌కు దగ్గరగా చేరుకున్నారని,ఆఫ్ఘనిస్తాన్‌పై పూర్తి నియంత్రణ సాధించారని దీంతో 2001లో ఐరాస చొరవతో కూలిపోయిన క్రూరమైన పాలన తిరిగి వస్తుందన్న భయాలను రేకేత్తిస్తోంది. ముఖ్యంగా మహిళలు, జర్నలిస్టులే లక్ష్యంగా తాలిబన్‌లు తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో మానవ హక్కులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారనే నివేదికలు తనను కలవర పెడుతున్నాయని అన్నారు. ఆఫ్ఘన్ బాలికలు, మహిళలు కష్టపడి సాధించుకున్న హక్కులను తిరిగి కోల్పోతుండటం హృదయ విదారకంగా, బాధాకరంగా ఉందని అన్నారు. స్థానిక పౌరులపై దాడులు చేపట్టడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం, యుద్ధ నేరంతో సమానమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







