భారత్ కరోనా అప్డేట్

- August 15, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. తాజాగా దేశంలో కొత్తగా 36,083 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్‌లో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,21,92,576 కి చేరింది.ఇందులో 3,13,76,015 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,336 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 493 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.దీంతో భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,31,225 కి చేరింది.థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌నే వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌ప్పని స‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com