ఏపీ కరోనా అప్డేట్

- August 15, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా కేసులు నమోదవుతునే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 65,500 పరీక్షలు నిర్వహించగా.. 1,506 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కొల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 19,93,697 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,647కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,835 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,62,185కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com