పురావస్తు పార్క్ ను సందర్శించిన సుల్తాన్ సతీమణి
- August 16, 2021
ఒమన్: ఒమన్ సుల్తాన్ సతీమణి ధోఫర్ గవర్నరేట్ సలాలాలోని విలాయత్లోని అల్ బలీద్ పురావస్తు పార్కును సందర్శించారు. పార్క్ లో ప్రధానమైన ఫ్రాంకిన్సెన్స్ ల్యాండ్ మ్యూజియంను ఆమె తొలుత సందర్శించినట్లు హెరిటేజ్& టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. పురావస్తు మ్యూజియంలో వివిధ కాలాలకు చెందిన పలు చారిత్రాత్మక వస్తువులు ఉన్నాయని, అలాగే ఒమానీ సాంప్రదాయ ఓడల నమూనాలు ప్రదర్శనకు ఉన్నట్లు వివరించింది. సుల్తాన్ సతీమణి పురావస్తు పార్కులోని వివిధ ఇతర విభాగాలను వీక్షించారు. ఆ తర్వాత ఒమాని కుటీర పరిశ్రమకు మద్దతుగా సంప్రదాయ హస్తకళలను విక్రయించే అవుట్లెట్లను సందర్శించారు. చివరగా VIP సందర్శకుల రిజిస్టర్లో తన ప్రశంసలను నమోదు చేయడంతో ఆమె పర్యటనను ముగించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







