సౌదీకి చేరుకున్న విదేశీ ఉమ్రా యాత్రికుల తొలి బృందం

- August 16, 2021 , by Maagulf
సౌదీకి చేరుకున్న విదేశీ ఉమ్రా యాత్రికుల తొలి బృందం

సౌదీ: కోవిడ్ 19 ఆంక్షల ఎత్తివేత తర్వాత విదేశీ ఉమ్రా యాత్రికుల తొలి బృందం సౌదీకి చేరుకుంది. కింగ్‌డమ్ విమానాశ్రయాలకు చేరుకున్న యాత్రికులను సౌదీ అధికారులు ఖర్జూరాలు, గులాబీలు, జామ్ జామ్ వాటర్ వంటి బహుమతులతో స్వాగతం పలికారు. హజ్ & ఉమ్రా డిప్యూటీ మంత్రి అబ్దుల్ఫత్తా బిన్ సులైమాన్ మషాత్ మాట్లాడుతూ.. సౌదీ ఉమ్రా బృందాలన్నీ విదేశీ యాత్రికులకు సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయని, యాత్రికులు సౌదీకి చేరుకున్న నాటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఉత్తమ సేవలను అందించడానికి అంకితమయ్యాయని అన్నారు. ఇదిలాఉంటే..కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటోంది సౌదీ ప్రభుత్వం. ఉమ్రా యాత్రకు వచ్చే యాత్రికులు తప్పకుండా తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. సౌద ఆమోదించిన మోడెర్నా, ఫైజర్-బయోటెక్, జాన్సన్ & జాన్సన్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లలో ఏదో ఒక వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. ఒకవేళ యాత్రికుల్లో ట్రావెల్ బ్యాన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే యాత్రికులైతే తప్పనిసరిగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com