సీఎంవో సెక్రటరీగా రాహుల్ బొజ్జా!
- August 16, 2021
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.దళితబంధు పథకం ప్రారంభోత్సవ వేదికపై సీఎంవో సెక్రటరీగా రాహుల్ బొజ్జాను నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ బొజ్జా ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్నారు. రాహుల్ బొజ్జా దళితుడే. వాళ్ల నాన్న బొజ్జా తారకం.. ఉద్యమంలో పని చేసిన వారికి న్యాయవాదిగా పనిచేశారు. ఆయన కుమారుడే రాహుల్ బొజ్జా.. ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగానే కాకుండా సీఎంవో సెక్రటరీగా కూడా ఉండాలని నిర్ణయం తీసుకునట్టుగా కేసీఆర్ తెలిపారు. రేపట్నుంచి సీఎంవో కార్యాలయంలో రాహుల్ బొజ్జా సెక్రటరీగా ఉంటారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా రాహుల్ బొజ్జా ఐఏఎస్ అధికారి. 2000 బ్యాచ్ కి చెందినవారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







