సెప్టెంబర్ 12న నీట్.. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవే!
- August 16, 2021
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ) 2021 అడ్మిట్ కార్డ్ http://neet.nta.nic.in అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12న నీట్ యూజీ-2021 నిర్వహిస్తారు. పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్‌లో పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇచ్చిన గడువు శనివారం (ఆగస్టు 14)తో ముగిసింది. ఈ నెల 15వ తేదీతో ఫీజు చెల్లింపు గడువు ముగిసింది.
ఇలా నీట్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్
నీట్ అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి నీట్-2021 అడ్మిట్ కార్డును ఎన్టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. నీట్ పరీక్ష రోజు అనుసరించాల్సిన, పాటించాల్సిన నిబంధనలను తప్పనిసరిగా చదవాలి.
నీట్-2021 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత.. దానిపై ఉన్న సమాచారం జాగ్రత్తగా చదవాలి. కోవిడ్ నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, అదనపు ముందు జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించాల్సిందే.
నిర్దేశిత టైంకు చేరుకోవాల్సిందే
హాల్ టికెట్‌పై పేర్కొన్న సమయంలోగానే నీట్ పరీక్ష హాలులో రిపోర్ట్ చేయాలి. వీలైతే పరీక్షకుముందు రోజు హాలును సదర్శిస్తే మంచిది. నీట్-2021 అడ్మిట్ కార్డులో తప్పులు ఉంటే వెంటనే ఎన్టీఏను సంప్రదించి, నివేదించాలి.
సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి
పరీక్ష రోజు నీట్-2021 అడ్మిట్ కార్డు, ఫోటో ఐడీ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకు రావాలి. నీట్ అడ్మిట్ కార్డుతోపాటు ఇటీవలి కాలంలో అభ్యర్థుల ప్రయాణం, ఆరోగ్యంపై సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. కోవిడ్ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు నీట్ అడ్మిట్ కార్డును ట్రావెల్ పాస్‌గా గతేడాది వాడుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన