ప్రవాసీయులకు తాత్కాలిక వర్క్ పర్మిట్లు ఇచ్చే యోచనలో ఒమన్

- August 17, 2021 , by Maagulf
ప్రవాసీయులకు తాత్కాలిక వర్క్ పర్మిట్లు ఇచ్చే యోచనలో ఒమన్

ఒమన్: ఒమన్ విజన్ 2040 లక్ష్యాలను అందుకునేందుకు అనుసరించాల్సిన అర్ధిక విధానాలు, చేపట్టాల్సిన ప్రాజెక్టులు, కార్మిక శక్తి ఆవశ్యతకు సంబంధించి వార్షిక నివేదిక విడుదలైంది. విజన్ 2040 లక్ష్య సాధన కోసం అవసరమైన కార్యచరణ రూపొందించేందుకు 2016లోనే తన్ఫీద్ ప్రోగ్రాంను చేపట్టిన విషయం తెలిసిందే. విడుదలైన వార్షిక నివేదిక మేరకు ఉద్యోగవకాశాలు, లేబర్ మార్కెట్ ను ప్రధానాంశాలుగా పేర్కొనబడ్డాయి. ఒకే సంస్థ కింద నమోదు చేయబడిన కంపెనీలల్లో విదేశీ కార్మిక శక్తిని బలోపేతం చేయాల్సిన ఆవశ్యత ఉందంటూ రిపోర్టులో స్పష్టం చేశారు. దీంతో ప్రవాసీయులకు తాత్కాలిక వర్క్ పర్మిట్లను అనుమతించే అంశంపై ఒమన్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com