పూర్తి స్థాయికి చేరిన ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు
- August 17, 2021
కువైట్: ఇక నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో పనివేళల్ని పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించింది కువైట్. అందుకోసం ఉద్యోగులు అందరూ విధులకు హజరయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వీలైనంత వరకు వర్చువల్ విధానంలో ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యకలాపాలను మేనేజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సేవలు ప్రారంభం అయ్యాయి. వేసవి ముగిసే సమయానికి దేశంలో 70 శాతం మందికి వ్యాక్సిన్ చేరుతుందనే అంచనాలు ఉండటంతో పాటు వ్యాక్సిన్ తో ఇప్పటికే వైరస్ వ్యాప్తి, మరణాల రేటు తగ్గిందని గణాంకాల సూచికలు సూచిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తిరిగి విధులకుల హజరయ్యేలా కువైట్ ఆంక్షలను సడలిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?







