సౌదీలో విస్తరిస్తున్న కొత్త వేరియంట్లలో డెల్టా కూడా ఉందన్న సౌదీ
- August 17, 2021
సౌదీ: జన్యు రూపం మార్చుకొని వ్యాప్తి చెందుతున్న కోవిడ్ కొత్త వేరియంట్లలో డెల్టా వేరియంట్ కూడా సౌదీలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ప్రస్తుతం కింగ్డమ్ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి 48 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఆగస్ట్ 4న 1,043 కోవిడ్ కేసులు నమోదైతే..గడిచిన 24 గంటల్లో ఆ సంఖ్య 542కి తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలాఉంటే గడిచిన 24 గంటల్లో కోవిడ్ సంబంధిత ఆరోగ్య కారణాల వల్ల 13 మంది చనిపోయారు. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 8,412కి పెరిగింది. గడచిన 24 గంటల్లో 1,041 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 5,38,525 మంది కోవిడ్ బారిన పడగా..5,23,050 మంది కోలుకున్నారు. సగానికి సగం తగ్గిన కోవిడ్ వ్యాప్తితో ప్రజల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. అయితే కొత్త ఉత్పరివర్తనాలతో ఇంకా ముప్పు పొంచి ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. డెల్టా వేరియంట్ కు సాధారణ జలుబు, మశూచి కంటే వేగంగా వ్యాప్తి చెందే గుణాలు ఉన్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు