ట్రావెల్ బ్యాన్ దేశాల ప్రవాసీయులకు సెప్టెంబర్ వరకు వీసా గడువు పెంపు
- August 18, 2021
సౌదీ: ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు, పర్యాటకులకు వీసా గడువు పొడిగించింది సౌదీ ప్రభుత్వం. రెసిడెన్సీ పర్మిట్(ఇకామాస్), ఎగ్జిట్& రీ-ఎంట్రీ వీసాలు, అలాగే ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాలలో ప్రస్తుతం చిక్కుకున్న ప్రవాసుల విజిట్ వీసాలను సెప్టెంబర్ 30, 2021 వరకు ఉచితంగా పొడిగిస్తున్నట్లు సౌదీ స్పష్టం చేసింది. పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి మంజూరు చేసిన ఇకామాలు, వీసాల చెల్లుబాటు వ్యవధిని ఉచితంగా పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ సమాచార కేంద్రం సహకారంతో వీసా గడువు పెంపు ఆటోమెటిగ్గా జరిగిపోతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్‌లు (జవాజత్) తెలిపింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







