బరువు తగ్గిన నివాసితులకు బహుమతులు
- August 18, 2021
అబుధాబి: మహమ్మారి కాలంలో వివిధ పద్ధతుల్లో బరువు తగ్గిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ(DAMAN) సీఈవో హమద్ అల్ మెహియాస్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మెహియాస్ పేరుతో ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్ ఛాలెంజ్ చేశారు. కొంత వ్యవధిలో ప్రత్యేక పద్దతులను అనుసరించి, బరువు తగ్గినవారు తాము అనుసరించిన విధానాలను ఈ ఛాలెంజ్‌లో షేర్ చేయడం ద్వారా ఐఫోన్, యాపిల్ వాచ్ తదితర బహుమతులను అందుకోవచ్చని తెలిపారు. ఈ మహమ్మారి సమయంలో ఆరోగ్యకరమైన అలవాట్లకు ఆంటకాలేర్పడ్దాయి. ఫలితంగా పలువురు బరువు పెరిగారని హమద్ అల్ మెహియాస్ పేర్కొన్నారు. ఇదిలావుండగా మహమ్మారి సమయంలో యూఏకీ చెందిన 31 శాతం మంది బరువు పెరిగారని ఒక అధ్యయనంలో తేలింది. 39 శాతం మంది శారీర వ్యాయామానికి దూరమై పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







