కృత్రిమ మేధస్సు రంగంలో యూఏఈ కీలక అడుగు

- August 19, 2021 , by Maagulf
కృత్రిమ మేధస్సు రంగంలో యూఏఈ కీలక అడుగు

యూఏఈ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిస్టరీలో యూఏఈ మరో మైల్ స్టోన్ చేరుకుంది. యూఏఈ రాజధాని అబుధాబిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటం కంప్యూటర్(సూపర్ కంప్యూటర్) ప్రోగ్రెస్ ను బయటి ప్రపంచానికి చాటేలా తొలి ఫ్రేమ్-క్రియోస్టాట్ ను టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ (TII) విడుదల చేసింది. బార్సిలోనా బేస్ గా పని చేస్తున్న కిలిమంజారో క్వాంటం టెక్ సహకారంతో TII క్వాంటం కంప్యూటర్‌ను నిర్మిస్తోంది.యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటేలా రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ కంప్యూటర్ తో ప్రపంచానికి క్వాంటం ప్రయోజనాలను అందించటమే తమ లక్ష్యంగా TII దూసుకెళ్తోంది. ఈ క్వాంటం కంప్యూటర్ పూర్తి స్థాయిలో సిద్ధం అయితే..విభిన్న రంగాల్లో అమూల్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని TII అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com