భార‌త్‌లో సెప్టెంబ‌ర్ నుంచి సింగిల్ డోస్ వ్యాక్సిన్‌

- August 19, 2021 , by Maagulf
భార‌త్‌లో సెప్టెంబ‌ర్ నుంచి సింగిల్ డోస్ వ్యాక్సిన్‌

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో మ‌రో మూడు వ్యాక్సిన్లు త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్నాయి.  అందులో ఒక‌టి స్పుత్నిక్ వీ లైట్.ర‌ష్యాకు చెందిన గ‌మ‌లేరియా సంస్థ ఈ వ్యాక్సిన్ ను త‌యారు చేసింది.ఇప్ప‌టికే అనేక దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది.భార‌త్‌ కు చెందిన ప‌నాసియా బ‌యోటెక్ సంస్థ ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఇప్ప‌టికే ఒప్పందం కుదుర్చుకున్న‌ది.ఈ ఒప్పందం త‌రువాత ప‌నాసియా సంస్థ భార‌త్‌లో అత్య‌వ‌స‌ర అనుమ‌తుల కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకుంది.ఈ వ్యాక్సిన్ డేటాను భార‌త్ డ్ర‌గ్ కంట్రోల్ త్వ‌ర‌లోనే ప‌రిశీలించే అవ‌కాశం ఉన్న‌ది.సెప్టెంబ‌ర్ నాటికి స్పుత్నిక్ వీ లైట్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంటున్నారు.ఇప్ప‌టికే భార‌త్‌లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న‌ది.స్పుత్నిక్ వీ రెండు డోసుల వ్యాక్సిన్ కాగా, స్పుత్నిక్ వీ లైట్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్.ప‌రాగ్వేలో స్పుత్నిక్ వీ లైట్ 93.5 శాతం సామ‌ర్ధ్యాన్ని క‌న‌బ‌రిచింద‌ని ఆర్‌డిఐఎఫ్ పేర్కొన్న‌ది.అయితే, రష్యాలో మే నెల‌లో ఈ వ్యాక్సిన్ కు అనుమ‌తి ఇచ్చారు.అప్ప‌ట్లో అక్క‌డ ఈ వ్యాక్సిన్ 79.4 శాతం సామ‌ర్థ్యాన్ని క‌న‌బ‌రిచింద‌ని ఆర్‌డీఐఎఫ్ హెడ్ కిరిల్ పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com