యూఎస్, యూకే వీసా ఉన్న భారత విజిటర్లకు దుబాయ్ శుభవార్త

- August 22, 2021 , by Maagulf
యూఎస్, యూకే వీసా ఉన్న భారత విజిటర్లకు దుబాయ్ శుభవార్త

దుబాయ్: యూఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ వీసాలు కలిగి ఉన్న భారత సందర్శకులకు  శుభవార్త చెప్పింది దుబాయ్ ప్రభుత్వం. వీరికి 14 రోజుల వీసా ఆన్ అరైవల్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అమెరికా ఇచ్చే విజిటర్ వీసా లేదా గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు 14 రోజులు దుబాయ్‌లో బస చేసే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే యూకే, యూరోపియన్ యూనియన్  జారీ చేసిన రెసిడెన్సీ వీసాలు ఉన్న భారత సందర్శకులకు కూడా ఇదే సౌకర్యం ఉంటుందని దుబాయ్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రయాణికులు తప్పనిసరిగా 48 లేదా 72 గంటల ముందు తీసుకున్న ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలని తెలిపారు. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి తీసుకున్నది ఉండాలని స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com