'రన్' చిత్రం పాటలు విడుదల...
- March 14, 2016
సం దీప్కిషన్, అనీషా ఆంబ్రోస్ నాయకానాయికలుగా నటించిన చిత్రం 'రన్'. అని కన్నెగంటి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర నిర్మాతలు. రామబ్రహ్మం సుంకర సమర్పకులు. సాయి కార్తీక్ స్వరకర్త. హైదరాబాద్‌లో పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని కథానాయకుడు అల్లరి నరేష్ ఆవిష్కరించారు. కథానాయకుడు రాజ్‌తరుణ్ స్వీకరించారు. ప్రచారచిత్రాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం విడుదల చేశారు. సందీప్‌కిషన్ చెబుతూ ''రన్'లో ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉంటాయి. అల్లరి నరేష్ అతిథిగా వచ్చిన నా సినిమా వేడుకలన్నీ విజయం సాధించాయి.ఆ సెంటిమెంటు 'రన్'కి పనిచేస్తుందనే నమ్మకం ఉంద''న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''వాణిజ్యాంశాలకు వినోదం మిళితమైన చిత్రమిది. సందీప్‌కిషన్ పాత్ర ఆకట్టుకునేలా కొత్త తరహాలో సాగుతుంది. ఈ చిత్రం మహత్ రాఘవేంద్ర కెరీర్‌కు ఉపయోగపడుతుంది. ప్రతి పాట శ్రోతల్ని అలరించేలా ఉంద''న్నారు. ''పాటలు చక్కగా కుదిరాయి. సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంద''న్నారు సాయి కార్తీక్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర మాట్లాడుతూ ''కాన్సెప్ట్ చిత్రాలను ఆదరిస్తున్న సమయంలో ఈ నెల 23న వస్తోన్న ఈ చిత్రమూ ప్రేక్షకాదరణ పొందుతుంది. సందీప్‌కిషన్‌కి సరిపోయే సినిమా. బాబిసింహకి తెలుగులో ప్రతినాయకుడుగా గుర్తింపు తీసుకొస్తుందీ చిత్రం. మహత్ రాఘవేంద్ర నటనకు మంచి మార్కులు పడతాయ''న్నారు. ఈ కార్యక్రమంలో బాబిసింహ, కాశీ విశ్వనాథ్, వీరు పోట్ల, ఆనంద్, జెమిని కిరణ్, ప్రవీణ్, రాజారవీంద్ర, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర, క్రాంతిమాధవ్, దశరథ్, రఘుకుంచె, మహత్‌రాఘవేంద్ర, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







