ఏపీడీజీపీ గౌతమ్ సవాంగ్ ని కలిసిన రమ్య ఫ్యామిలీ..
- August 23, 2021
అమరావతి: ఏపీలో సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసు విషయంపై రమ్య కుటుంబ సభ్యులు ఏపీడీజీపీని కలిశారు.ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రమ్య కుటుంబ సభ్యులు హత్యకు ముందు, తరువాత జరిగిన పరిణామాలను వివరించారు. ఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు చెప్పారు.ఒక దుర్ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని రమ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అంతేకాదు తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారని రమ్య కుటుంబ సభ్యులు వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయా మంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో తమకు భోజనం కూడా చేయాలనిపించడంలేదని రమ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

రమ్య ఫ్యామిలీ కి డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించిన గౌతమ్ సవాంగ్ అభినందించారు. రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలో రమ్య ఫ్యామిలీని మానసికంగా వేదిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రమ్య హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసామని.. ఇక కోర్టులో ట్రైల్ కూడా త్వరగా పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా న్యాయస్థానాన్ని కోరతామని తెలిపారు. మహిళ భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









