జాజికాయ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది
- August 24, 2021
1. జాజికాయ మీ శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది.ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
2. ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నందున ఆకలిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
3. జాజికాయలో ఉన్న మాంగనీస్ శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది.
4. జాజికాయ నిద్రలేమి ఇబ్బందులను తొలగిస్తుంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో అర స్పూన్ జాజికాయ పొడి వేసుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది.
5. జాజికాయ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గాలంటే ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. జాజికాయ కాలేయం, మూత్రపిండాల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉన్న నూనెలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నందున, నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది సహాయపడుతుంది, "జాజికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని నివారించడంలో సహాయపడుతాయి. జాజికాయ పొడికి తగినంత తేనె కలిపి పేస్ట్ తయారు చేసి మొటిమలపై రాసి 20 నిమిషాలు ఉంచాలి. ఆపై గోరు వెచ్చని నీటితో కడగాలి. జాజికాయ పొడికి కొన్ని చుక్కల పాలను కలిపి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌తో శరీరంపై మసాజ్ మృత కణాలు తొలగిపోతాయి. బరువు తగ్గడం మాత్రమే కాదు, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలను ఎదుర్కోవడంలో కూడా జాజికాయ సహాయపడుతుంది. అయితే గర్భవతులు లేదా అలెర్జీ లక్షణాలు ఉన్న వ్యక్తులు జాజికాయకు దూరంగా ఉండాలి. జాజికాయ పొడిని సూప్‌లు, గ్రీన్ టీలు, పప్పు మొదలైన వాటిల్లో వేసుకోవచ్చు.ఇది రుచికి చాలా చేదుగా ఉంటుంది.
తాజా వార్తలు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి









