టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్..!
- August 25, 2021
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను బదిలీ చేసింది ప్రభుత్వం… వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు.. ఆయన వరంగల్ సీపీగా ఉన్న సమయంలో యాసిడ్ దాడి చేసిన కేసులో నిందితుల ఎన్‌కౌంటర్, ఆ తర్వాత సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో సజ్జనార్ పేరు మారుమోగింది.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలు అందిస్తున్న సజ్జనార్.. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో కలిసి.. కరోనా, ట్రాఫిక్, ఇతర సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, ఉన్నట్టుండి ఆయనను బదిలీచేసింది తెలంగాణ సర్కార్… తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. ఇక, సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను నియమించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







