కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు..
- August 26, 2021
కాబూల్: కాబూల్ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. దీనిని ఆత్మాహుతి దాడిగా అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. బాంబు పేలుడు సంఘటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు.
ఆఫ్గనిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కాబూల్ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. దీనిని ఆత్మాహుతి దాడిగా అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. ప్రాణనష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెంటగాన్ అధికారులు సమాచారమిచ్చారు. కాగా, కాబూల్ విమానాశ్రయం వద్ద దాడులు జరగొచ్చని ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. బ్రిటన్, ఆస్ట్రేలియా సైతం ఈ హెచ్చరికలను సమర్థించాయి. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
బాంబు పేలుడు సంఘటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పైలట్.. విమానాన్ని సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కాబూల్ నుంచి అధికారులు, జర్నలిస్టులను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







