వైరల్ క్యాట్ రెస్క్యూ వీడియో: నలుగురు హీరోలకి 50,000 దిర్హాముల బహుమతి
- August 27, 2021
యూఏఈ: గర్భంతో వున్న ఓ పిల్లిని రక్షించిన నలుగురు వ్యక్తులకు 50,000 దిర్హాముల బహుమతి ఒక్కొక్కరికీ లభించింది. ఆ పిల్లి ఓ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి పడిపోగా, నలుగురు వ్యక్తులు చాకచక్యంగా దాన్ని కాపాడారు. వీరిని దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అభినందించారు. దుబాయ్ రూలర్ కార్యాలయం అధికారి ఈ నేపథ్యంలో మొరాకో వాచ్మెన్ అయిన అష్రాఫ్, పాకిస్తానీ సేల్స్‌మేన్ ఆతిఫ్ మొహమ్మద్, నాజర్ అనే ఇండియన్ డ్రైవర్, మొహమ్మద్ రషీద్ అనే మరో వ్యక్తికి నగదుని అందించడం జరిగింది. ఈ ఘటనకు ముందు, ఈ నలుగురు వ్యక్తులూ ఒకరంటే ఒకరికి తెలియనివారే కావడం గమనార్హం. పిల్లిని రక్షించేందుకు వీరంతా నడుం బిగించారు. పైనుంచి పడిపోతున్న పిల్లిని కాపడేందుకు కింద నిలబడి ఓ వస్త్రాన్ని నలుగురూ పట్టుకోగా, దాంట్లో పిల్లి క్షేమంగా పడింది. ఈ వీడియో వైరల్ అవడంతో, దుబాయ్ రూలర్ దృష్టికి వెళ్ళింది.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









