టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు చేరిన భవినా పటేల్
- August 28, 2021
టోక్యో: టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్ చరిత్ర సృష్టించింది. జపాన్ దేశంలోని టోక్యో నగరంలో శనివారం జరిగిన టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో భవినా ఫైనల్ కు చేరుకుంది.టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో భారతదేశ ప్లేయర్ భవినా పటేల్ 7-11, 11-7, 11-4, 9-11, 11-8తో చైనాకు చెందిన జాంగ్ మియావోను ఓడించింది. ఆదివారం జరిగనున్న టేబుల్ టెన్నిస్ బంగారు పతకం పోటీలో చైనాకు చెందిన యింగ్ జౌతో భవినా తలపడనుంది.
టోక్యోలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్లాస్ 4 ఈవెంట్‌లో ప్రపంచ 3 వ ర్యాంకర్ చైనాకు చెందిన జాంగ్ మియావోపై భవినా ఘన విజయం సాధించారు.పారాలింపిక్స్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా భవినా పటేల్ చరిత్రలో నిలిచారు. ‘‘నేను ఆటలో వందశాతం ప్రతిభ కనబర్చాను, ఫైనల్ ఈవెంటులో నేను బంగారుపతకం తప్పక సాధిస్తాను’’ అని భవినా ఆత్మవిశ్వాసంతో చెప్పారు. సంపూర్ణంగా కృషి చేస్తే సాధించలేనిది లేదని నిరూపించాను అని భవినా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









