అమెజాన్‌లో ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి..!
- August 29, 2021
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖాతాదారులకు శుభవార్త వినిపించింది. నచ్చిన వస్తువును ఇప్పుడు కొనుగోలు చేసి తర్వాత చెల్లించే (బై నౌ-పే లేటర్) విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే కొనుగోలు చేసిన వస్తువు మొత్తాన్ని 50 డాలర్లు అంతకంటే ఎక్కువగా విభజించి ప్రతి నెలా వాయిదాల పద్ధతిలో చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విషయంలో వినియోగదారులకు అనుకూలంగా ఉండే పేమెంట్ ఆప్షన్ల కోసం పేమెంట్ నెట్‌వర్క్ అఫిర్మ్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది.
కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలో ఎంపిక చేసిన వినియోగదారులపై పరీక్ష దశలో ఉంది. త్వరలోనే దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొనుగోలు చేసిన వస్తువు ధరను ముందు ఎంత చూపించారో ఆ తర్వాత కూడా అంతే చెల్లించాల్సి ఉంటుందని, ఆ తర్వాత అంతకుమించి ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదని, అలాగే ఎలాంటి చార్జీలు ఉండబోవని అఫిర్మ్ స్పష్టం చేసింది. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ లేనందున చాలా మంది క్రెడిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అమెజాన్‌లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అఫిర్మ్ చెబుతోంది. త్వరగానే వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







