విజిట్ వీసా, ఎంట్రీ పర్మిట్ కలిగినవారికి దుబాయ్ వెళ్ళేందుకు గ్రీన్ సిగ్నల్

- August 30, 2021 , by Maagulf
విజిట్ వీసా, ఎంట్రీ పర్మిట్ కలిగినవారికి దుబాయ్ వెళ్ళేందుకు గ్రీన్ సిగ్నల్

యూఏఈ: ఆగస్ట్ 30 నుంచి ఎంట్రీ పర్మిట్ కలిగినవారు, విజిట్ వీసా కలిగినవారు (ఇప్పటివరకూ దుబాయ్ వెళ్ళేందుకు ఆంక్షలు కలిగివున్న దేశాలకు సంబంధించిన ప్రయాణీకులు) దుబాయ్ వెళ్ళవచ్చు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ (ఐసిఎ) అలాగే నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్‌సిఇఎంఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారికి వీసాల జారీ ప్రక్రియను ఆగస్ట్ 30 నుంచి పునఃప్రారంభించడం జరిగింది. యూఏఈ అథారిటీస్ రాజీ చేసిన వీసా, ఎంట్రీ పర్మిట్ వున్నవారు దుబాయ్‌కి వచ్చేందుకు వీలు కలుగుతుంది. ఎంప్లాయిమెంట్, షార్ట్ లేదా ఎక్స్‌టెండెడ్ స్టే, విజిట్ మరియు కొత్తగా జారీ చేసిన రెసిడెన్స్ వీసా కలిగినవారు అప్రూవ్ చేయబడిన వీసా కేటగిరీలో వున్నారు. బంగ్లాదేశ్, కాంగో, ఇండియా, లైబీరియా, నాంబియా, నేపాల్, నైజీరియా, పాకిస్తాన్, సియెర్రా లియోన్, శ్రీలంక, సౌతాఫ్రికా, ఉగాండా, వియెత్నాం మరియు జాంబియా దేశాలకు చెందినవారు దుబాయ్ వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ మేరకు ఎయిర్‌లైన్స్ సంస్థలకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ నుంచి ముందస్తు అనుమతి రెసిడెన్సీ వీసా కలిగినవారికి తప్పనిసరి. వీసా కలిగిన మిగిలినవారంతా ర్యాపిడ్ పిసిఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సి వుంటుంది. బయల్దేరే విమానాశ్రయం వద్ద ఆరు గంటల ముందుగా ఈ టెస్ట్ తీసుకోవాలి. ఇండియాకి చెందిన నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా కూడా ట్రావెల్ ఏజెంట్లకు కొత్త గైడ్ లైన్స్ పేర్కొంటూ నోటీసు విడుదల చేయడం జరిగింది.అబుధాబి మరియు షార్జాలకు ప్రయాణీకులు వెళ్ళడానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ అథారిటీస్ నుంచి మరింత స్పష్టత కోసం ఇండియన్ అథారిటీస్ ఎదురుచూస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com