బహ్రెయిన్, భారత్ విదేశాంగ మంత్రుల భేటీ..ద్వైపాక్షిక బంధంపై డిస్కషన్

- September 02, 2021 , by Maagulf
బహ్రెయిన్, భారత్ విదేశాంగ మంత్రుల భేటీ..ద్వైపాక్షిక బంధంపై డిస్కషన్

మనామా: బహ్రెయిన్ లో అధికార పర్యటలో ఉన్న భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి హెచ్.ఈ.వీ. మురళీధరన్ తో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లాతీఫ్ బిన్ రషీద్ అల్-జయానీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య దృఢమైన చారిత్రక స్నేహ సంబంధాలను, అన్ని స్థాయిలలో ఇరు దేశాల మధ్య బలపడుతున్న సహకారాన్ని ప్రశంసిస్తూ బహ్రెయిన్ విదేశాంగ మంత్రి మురళీధరన్‌కు స్వాగతం పలికారు.గత ఏప్రిల్‌లో బహ్రెయిన్, ఇండియా మధ్య న్యూఢిల్లీలో జరిగిన ఉమ్మడి ఉన్నత కమిటీ మంత్రివర్గ సమావేశ ఫలితాలను ఇరు దేశాల మంత్రులు సమీక్షించారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపులను క్రమంగా కొనసాగించాలని బహ్రెయిన్ మంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. బహ్రెయిన్ పర్యటనకు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మురళీధరన్...పరస్పర గౌరవంతో ద్వైపాక్షిక బంధం అడ్వాన్స్ లెవల్ కు చేరుకోటాన్ని ప్రశంసించారు. బహ్రెయిన్ తమ పురోగతిని కొనసాగించాలని కోరుకుంటున్నానని, అందుకు తమ వంతు సహాకారం ఎప్పటికీ ఉంటుందని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com