ఈడీ విచారణ కు హాజరైన నటి ఛార్మి
- September 02, 2021
హైదరాబాద్: 2017లో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విచారణ ఎదుర్కొన్న సినీనటి చార్మి..ఈరోజు మరోసారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యింది. కెల్విన్ సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు చిత్రసీమలో కొంతమందిని విచారిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాద్ ను అధికారులు విచారించడం జరిగింది. దాదాపు 10 గంటల పాటు పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. పూరి జగన్నాథ్ స్టేట్మెంట్ను లిఖిత పూర్వకంగా నమోదు చేసింది. భవిష్యత్తులో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు.
ఇక ఈరోజు ఈడీ అధికారుల ముందు నటి,నిర్మాత ఛార్మి హాజరైంది.ఛార్మి బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలపై అధికారులు విచారణ కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరీ జగన్నాథ్‌తో పాటు రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







