ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ..
- September 03, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా పది అంశాలకు సంబంధించిన లేఖలను కేసీఆర్.. ప్రధానికి అందజేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై మోడీతో చర్చించారు.అలాగే ఐపీఎస్‌ల సంఖ్య పెంపు, కొత్త జిల్లాలకు సరిపడా ఐపీఎస్‌లను కేటాయించాలని సీఎం...మోడీని కోరారు.హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌పైనా విజ్ఞప్తి చేశారు.కొత్త జిల్లాలకు జవహర్ నవోదయా విద్యాలయాలను కేటాయించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐఐటీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కు అదనపు నిధులతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని కేసీఆర్..మోడీని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









