తెలంగాణ కరోనా అప్డేట్
- September 04, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మూడు, నాలుగు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 306 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,59,313 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 3,883 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 366 మంది కోలుకఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,49,757 మంది కోలుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.55 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 69,422 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి రాష్ట్రంలో 24917603 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







