సర్దార్ బాడీగార్డ్‌గా సాయిధరమ్‌తేజ్
- March 15, 2016
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'. 'గోపాల గోపాల' చిత్రం తరువాత చాలా విరామం తీసుకుని పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెట్‌లో యువహీరో సాయిధరమ్‌తేజ్ సందడి చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయిధరమ్‌తేజ్ సోషల్‌మీడియా ద్వారా రెండు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ నడుస్తుంటే అటు ఇటు ఇద్దరు వ్యక్తులు గన్స్ చేతబట్టుకుని బాడీగార్డ్స్‌లా వస్తున్నారు.ఇందులో ఒకరు 'సుబ్రమణ్యం ఫర్ సేల్' హీరో సాయిధరమ్‌తేజ్, మరొకరు ఆయన తమ్ముడు. సాయిధరమ్‌తేజ్ ఈ ఫొటోలను పంచుకుంటూ... సర్దార్ గబ్బర్‌సింగ్ కొత్త బాడీగార్డ్స్ అని సరదాగా పోస్ట్ చేశారు. చూడ చక్కగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన కాజల్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. రాయ్ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, కృష్ణ భగవాన్, బ్రహ్మాజీ, సంజన, తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 20న చిత్రం ఆడియో విడుదల వేడుకలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న చిత్రం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







