స్పుత్నిక్ V బూస్టర్ షాక్ కు బహ్రెయిన్ ఆమోదం
- September 05, 2021
బహ్రెయిన్: రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ V వినియోగానికి బహ్రెయిన్ నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు నిండి 6 నెలల క్రితం రెండు డోసులు తీసుకున్న వారు స్పుత్నిక్ V బూస్టర్ షాట్ తీసుకునేందుకు అర్హులు అని వివరించింది. క్లినికల్ ట్రయల్స్ సమీక్షలు సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గమాలయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ ఫెడరేషన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ టీకా కమిటీ సమీక్ష... తాజా కోవిడ్ -19 పరిణామాలు, అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానాలను పూర్తిగా బేరీజు వేసుకున్న తర్వాత స్పుత్నిక్ Vకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మెడికల్ టాస్క్ ఫోర్స్ వివరించింది. బూస్టర్ షాక్ కు అర్హులైన వారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను healthalert.gov.bh, బీఅవేర్ అప్లికేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!
- ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ లో కొత్త నిబంధనలు..!!
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!