ఖతార్ పర్యటనకు సౌదీ మంత్రి..స్వాగతం పలికిన ప్రధాని

- September 05, 2021 , by Maagulf
ఖతార్ పర్యటనకు సౌదీ మంత్రి..స్వాగతం పలికిన ప్రధాని

దోహా: అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ ఖతార్ చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రితో పాటు అతని ప్రతినిధుల బృందానికి ఖతార్ సాదర స్వాగతం పలికింది. ఖతార్ ప్రధాని, అంతర్గత శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, అంతర్గత మంత్రిత్వ శాఖలోని అనేక ర్యాంకింగ్ అధికారులు సౌదీ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఖతార్లోని సౌదీ అరేబియా రాయబారి మన్సూర్ బిన్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఫర్హాన్ అల్-సౌద్ కూడా సౌదీ మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com