సినోఫార్మ్, సినోవవాక్ వేసుకున్న వారికి కూడా సౌదీలోకి ఎంట్రీ
- September 07, 2021
సౌదీ: సౌదీకి ప్రయాణించే ప్రయాణికుల విషయంలో మరో అప్ డేట్ ను ప్రకటించింది కింగ్డమ్ ప్రభుత్వం. సినోఫార్మ్ లేదా సినోవాక్ వ్యాక్సిన్ లను రెండు తీసుకున్న వారికి కూడా సౌదీకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..దానికి అదనంగా సౌదీ ప్రభుత్వం ఆమోదించిన నాలుగు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక దానిని బూస్టర్ డోస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..సౌదీలో ఆమోదం పొందిన ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రా జెనెకా, ఫైజర్ బయోన్టెక్, మోడర్నాలో ఏదో ఒక వ్యాక్సిన్ను రెండు డోసులు తీసుకుంటే దేశంలోకి ఆగస్ట్ 1 నుంచి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే..వ్యాక్సిన్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్లను అరబిక్ లేదా ఆంగ్లంలో వెబ్ సైట్ ద్వారా ముందస్తుగానే అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







