అల్ హోస్న్ గ్రీన్ స్టేట‌స్‌పై వెనక్కి తగ్గిన సెహా..

- September 07, 2021 , by Maagulf
అల్ హోస్న్ గ్రీన్ స్టేట‌స్‌పై వెనక్కి తగ్గిన సెహా..

యూఏఈ: ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లు, పర్యాటకులకు అల్ హోస్న్ యాప్ లో గ్రీన్ స్టేటస్ తప్పనిసరి చేస్తూ నిన్న ఉత్తర్వ్యులు జారీ చేసిన అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (SEHA) తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లకు, పర్యాటకులకు గ్రీన్ స్టేటస్ తప్పనిసరి అనే నిర్ణయంపై తాము తదుపరి సమీక్ష నిర్వహించి తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకు సోమవారానికి ముందు ఉన్న పాత నిబంధనలే పాటించాలని స్పష్టం చేసింది. నిన్న జారీ చేసిన ఉత్తర్వ్యుల మేరకు ఆస్పత్రులకు వెళ్లే వారికి కూడా హోస్న్ యాప్ లో గ్రీన్ స్టేటస్ తప్పనిసరి. అత్యవసర విభాగాలు, డ్రైవ్-త్రూ టెస్టింగ్ సెంటర్లకు వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఇదిలాఉంటే..కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం అల్ హోస్న్ యాప్ లో గ్రీన్ స్టేటస్ ఉన్న వ్యక్తులే ప్రబ్లిక్ ప్లేసుల్లో సందర్శించేందుకు అర్హులు అని ఆగస్ట్ 20 సెహా ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే గ్రీన్ స్టేటస్ లేని వ్యక్తులు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు, రిటైల్ ఔట్ లెట్‌లు, జిమ్‌లు, ఈవెంట్లు, స్పోర్ట్స్ ఈవెంట్లు, హెల్త్ క్లబ్‌లు, రిసార్ట్‌లు, విద్యాసంస్థల్లోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com