టీ20 వరల్డ్ కప్: టీంను ప్రకటించిన BCCI…
- September 08, 2021
యూఏఈ: అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తుండగా తాజాగా బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించింది.
ఇక ఈ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అయితే ఈ జట్టులో అనూహ్యంగా కొంతమంది ఆటగాళ్లకు చోటు లభించింది. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ జట్టులో స్థానం సంపాదించగా.. అనూహ్యంగా రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలతో పాటుగా అశ్విన్ ను కూడా ఎంపిక చేసింది బీసీసీఐ.
జట్టులో బ్యాట్స్మెన్స్ విభాగంలో కోహ్లీ, రోహిత్ లతో పాటుగా కేఎల్ రాహుల్, సూర్య కుమార్ లు ఉండగా వికెట్ కీపర్స్ గా ఇషాన్ కిషన్, పంత్ వ్యవరించనున్నారు. ఆల్ రౌండర్స్ విభాగంలో హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇక స్పిన్నర్ లుగా అశ్విన్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలు ఎంపిక కాగా పేస్ విభాగంలో బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. అలాగే స్టాండ్‌బై ప్లేయర్స్ గా శ్రేయాస్ అయ్యర్, శార్దూల ఠాకూర్, దీపక్ చాహర్ ఉన్నారు.
భారత జట్టును చూస్తేనే సెలక్టర్లు స్పిన్ కు పెద్దపీట వేసినట్లు అర్ధం అవుతుంది. ఎందుకంటే యూఏఈ లో ఉన్న పిచ్ లు ఎక్కువ స్పిన్నర్ లకే అనుకూలిస్తాయి. ఆ కారణంగానే అశ్విన్ జట్టులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ జట్టులో ఉంటాం అనుకున్న ధావన్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, పృథ్వీ షా లకు షాక్ తగిలింది అనే చెప్పాలి.
అయితే ఈ ప్రపంచ కప్ జట్టుకు భారత మాజీ సారథి, మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోని మెంటర్ గా వ్యవరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
భారత జట్టు : విరాట్ కోహ్లీ (C), రోహిత్ శర్మ (VC), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా , భువనేశ్వర్ కుమార్, షమీ
స్టాండ్‌బై ప్లేయర్స్ : శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







