ముంపు సమస్యపై యుద్ధప్రాతిపదికన అష్గల్‌ రెస్పాన్స్‌

- March 15, 2016 , by Maagulf
ముంపు సమస్యపై యుద్ధప్రాతిపదికన అష్గల్‌ రెస్పాన్స్‌


భారీ వర్షాలతో ఖతార్‌ కొద్ది రోజుల క్రితం అతలాకుతలమైంది. అయితే పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ అష్గల్‌, అద్భుతమైన రీతిలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మార్చ్‌ 7 నుంచి 9 వరకు భారీ వరానషలు కురిశాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వేర్వేరుగా టీమ్‌లను అష్గల్‌ నియమించింది. ఒక్కో టీమ్‌ని ఒక్కో చోటకు పంపించి, వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించింది అష్గల్‌. ఎమర్జన్సీ స్టాండ్‌ బై ఏర్పాటు చేయడం ద్వారా సకాలంలో స్పందించడానికి వీలయ్యిందని అష్గల్‌ అధికారులు చెప్పారు. దోహా, అల్‌ రయ్యాన్‌, ఉమ్‌ సలాల్‌ మున్సిపాలిటీల్లో నీటి ముంపు సమస్య ఎక్కువగా కన్పించింది. ప్రధాన రహదార్లు, టన్నెల్స్‌, డ్రైనేజ్‌ సిస్టమ్స్‌ని క్లియర్‌ చేసేందుకు మెరికెల్లాంటి సిబ్బందితోపాటు, తగిన యంత్రాలను, సాంకేతిక సహాయాన్ని ఉపయోగించామని అష్గల్‌ ప్రకటనలో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com