ఉల్లంఘనుల్ని పట్టుకునేందుకు ట్రాఫిక్ క్యాంపెయిన్

- September 09, 2021 , by Maagulf
ఉల్లంఘనుల్ని పట్టుకునేందుకు ట్రాఫిక్ క్యాంపెయిన్

కువైట్: సాంకేతిక తనిఖీ విభాగం - జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తనిఖీలను నిర్వహించింది. షువైక్, జిలీబ్ అల్ షుయోక్ మరియు ఫహాహీల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించారు. కారు ఇన్సూరెన్సు గడువు తీరడం, పరిమితికి మించిన శబ్ధం చేయడం, కాలుష్య ఉద్గారాలు, చట్ట విరుద్ధంగా ప్రయాణికుల్ని తరలించడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. నాలుగు సెక్యూరిటీ బృందాలు ఈ తనిఖీల్ని నిర్వహించాయి. అన్ని గవర్నరేట్లలో తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com