సమస్యలు ఉంటే సంప్రదించండి :సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
- September 09, 2021
హైదరాబాద్: పోలీసులకు సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం.స్టేఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లతో సైబరాబాద్ సీపీ సమావేశమయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన 200 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్బీ, ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్, సీసీఆర్బీ, షీ టీమ్స్ తదితర విభగాలకు చెందిన కానిస్టేబుళ్లు,హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లతో సిబ్బంది తో సీపీ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తాను పోలీస్ కుటుంబం నుంచి వచ్చానని పోలీసుల కష్టాలు బాధలు తనకు బాగా తెలుసునన్నారు. అనంతరం సీపీ సిబ్బందిని అడిగి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. నేరుగా వారితో మాట్లాడి వారి సాధకబాధలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సిబ్బంది తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియపర్చేందుకు ఒక ప్రత్యేక Grievance redressal mechanism/ ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.పిల్లలను చదువుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తూ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







