ఏపీ కరోనా అప్డేట్
- September 09, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,856 శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 14 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, గడిచిన 24 గంటల్లో 1,311 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
తాజా టెస్ట్‌లతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశీలించిన శాంపిల్స్ సంఖ్య 2,71,61,870కి చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 20,26,042కు చేరింది. రికవరీ కేసులు 19,97,454కు పెరిగితే.. ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 13,964కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







