తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- September 09, 2021
హైదరాబాద్: తెలంగాణలో గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 315 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక, 340 మంది ఇదే సమయంలో పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,786 నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,891కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 6,51,425 చేరుకున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 5,470 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 75,199 శాంపిల్స్ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. తాజా కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 83 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







