ఆంక్షల సడలింపు: వ్యాక్సినేషన్ పొందిన రెసిడెంట్స్‌కి దేశంలోకి అనుమతి

- September 11, 2021 , by Maagulf
ఆంక్షల సడలింపు: వ్యాక్సినేషన్ పొందిన రెసిడెంట్స్‌కి దేశంలోకి అనుమతి

యూఏఈ: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియెత్నాం, నాంబియా, జాంబియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్, లైబీరియా, సౌతాఫ్రికా, నైజీరియా మరియు ఆప్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చేవారిపై గతంలో కొన్ని ఆంక్షలు వుండగా, ఇప్పుడు ఆ ఆంక్షల్ని యూఏఈ సడలించింది. పై దేశాలకు చెందిన యూఏఈ నివాసితులకు వ్యాక్సిన్ పూర్తయితే, వారిని యూఏఈలోకి అనుమతిస్తారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన వ్యాక్సిన్లను పొందిన వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com