తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- September 11, 2021
తిరుపతి: తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయనున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి విమానాశ్రయం కూడా ఒకటి. ఈ ఎయిర్ పోర్టును కూడా ప్రయివేట్ పరం చేసేందుకు పావులు కదుపుతోంది. తిరుమల శ్రీనివాసుడిని నిత్యం లక్షల మంది దర్శించుకుంటుంటారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి కూడా భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తిరుపతిలోని విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తిరుపతి శ్రీనివాసుడిని దర్శించుకునేవారిలో చాలామంది రైలు ప్రయాణంతో పాటు విమాన ప్రయాణాలకు కూడా మెగ్గుచూపుతున్నారు. ఇటీవల విమానంలో తిరుపతికి చేరుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు నుంచి అతి తక్కువ సమయంలో తిరుపతి చేరుకోవచ్చు. సమయం కూడా చాలా ఆదా అవుతుంది. అందుకే చాలామంది ప్రయాణికుల ఈ విమాన ప్రయాణంపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రైలు ప్రయాణం కొంచెం భారంగా అనిపిస్తోంది. తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవాలంటే వాయు మార్గమే చాలా సులభమమని భావిస్తున్నారు. సాధారణంగా విమాన ప్రయాణాన్ని ఎక్కువగా సంపన్నవర్గాలకు చెందిన వారే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ఇటీవల పరిస్థితుల్లో సామాన్యులు కూడా తిరుపతికి విమానంలోనే ప్రయాణం చేస్తున్నారు. ఇంతగా ప్రసిద్ధిచెందిన తిరుపతి విమానాశ్రయాన్ని కేంద్రం ప్రయివేట్ పరం చేయాలనుకోవడంతో అందరిని షాకింగ్ గురిచేస్తోంది. త్వరలోనే తిరుపతి విమానశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎయిర్ పోర్టును కూడా ప్రయివేట్ పరం చేయాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలో లాభాల్లో మేజర్ ఎయిర్‌పోర్టులతో కలిపి.. నష్టాల్లో ఉన్న మైనర్ ఎయిర్‌పోర్టులతో పాటు తిరుపతి ఎయిర్ పోర్టుకు ముడిపెట్టింది కేంద్రం. తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌తో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను లింక్ చేసింది.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







